బాబర్ అజాం రికార్డు సమం చేసిన గిల్

బాబర్ అజాం రికార్డు సమం చేసిన గిల్

న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో టీమిండియా ఓపెనర్  శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. మొదటి వన్డేలో డబుల్ సెంచరీ చేసిన గిల్.. మూడో వన్డేలో సెంచరీ బాదాడు. మొత్తం మూడు వన్డేల్లో కలిపి గిల్ 360 పరుగులు చేశాడు. దీంతో 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ లో 360 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గిల్ రికార్డు సృష్టించాడు. దీంతో పాటుగా 3 వన్డేల సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం రికార్డును సమం చేశాడు. 2016లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో బాబర్ అజాం కూడా 360 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.  ఇప్పుడు అతని సరసన గిల్ చేరాడు. 

ధావన్ రికార్డు బద్దలు 

వన్డేల్లో వేగంగా 4 సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా కూడా శుభ్‌మన్ గిల్  రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ 24  ఇన్నింగ్సుల్లో 4 సెంచరీలు చేస్తే గిల్ 21 ఇన్నింగ్సుల్లోనే 4  సెంచరీలు కంప్లీట్ చేశాడు.