పెట్రోల్ రేట్లపై జర్నలిస్ట్ ప్రశ్న.. రాందేవ్ గుస్సా

పెట్రోల్ రేట్లపై జర్నలిస్ట్ ప్రశ్న.. రాందేవ్ గుస్సా

యోగా గురు రాందేవ్ బాబా కోపానికి వచ్చిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. లైవ్‌లోనే ఓ జర్నలిస్టుపై అసహనం వ్యక్తం చేస్తూ.. నీకే మంచిది కాదంటూ బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్యానా కర్నాల్‌లోని ఓ కార్యక్రమంలో రాందేవ్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా 2014లో రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై ఓ జర్నలిస్టు ప్రశ్చించారు. లీటర్ పెట్రోల్ 40 రూపాయలు, గ్యాస్ సిలిండర్ 300 రూపాయలకు ఇచ్చే ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని 2014 లో  ప్రజల్ని కోరిన విషయాన్ని గుర్తు చేసి.. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ ధరలపై రాందేవ్‌ను ఆయన ప్రశ్నించారు. దీంతో.. ‘‘అవును.. చెప్పాను.. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఇలాంటి ప్రశ్నలు మళ్లీ మళ్లీ అడగకండి.. నేనేమీ.. మీ కాంట్రాక్టర్‌‌ను కాదు. అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. అయినా మరోసారి జర్నలిస్టు ఇదే క్వశ్చన్ అడగ్గా.. ‘‘ఇప్పుడేం చేస్తావు..? మళ్లీ ఈ క్వశ్చన్ అడగకు.. ఇది నీకే మంచిది కాదు. మీ పెరెంట్స్‌కు నువ్వు మంచి కొడుకుగా ఉండాలి” అంటూ జర్నలిస్టుకు రాందేవ్ వార్నింగ్ ఇచ్చారు.

మరిన్ని వార్తల కోసం..

హైదరాబాద్‌లో రూ.115 దాటిన పెట్రోల్ రేటు

యాదాద్రి ప్రధానాలయంలో ఇంకా మొదలవ్వని పూజలు

ఆస్తి పన్ను కట్టేందుకు ఇయ్యాలే ఆఖరు