
ముల్హెమ్ (జర్మనీ): ఇండియా యంగ్ షట్లర్ లక్ష్యసేన్ జర్మన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లగా.. స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్ 21–15, 21–16తో ఇండియాకే చెందిన సీనియర్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్‌పై వరుస గేమ్స్‌లో విజయం సాధించాడు. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్... లక్ష్యకు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాడు. ఇక, మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 10–21, 21–23తో వరల్డ్ నంబర్ వన్, టాప్ సీడ్ విక్టర్ ఆక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. ఫస్ట్ గేమ్‌లో ప్రభావం చూపలేకపోయినా శ్రీ... రెండో గేమ్‌లో పోరాడాడు. అయితే, చివర్లో మళ్లీ తడబడి మ్యాచ్ కోల్పోయాడు. శనివారం జరిగే సెమీస్‌లో విక్టర్‌తో లక్ష్యసేన్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.