నాలుగు కథలు.. ఒకే సినిమా

నాలుగు కథలు.. ఒకే సినిమా

టైటిల్‌: ఇండియా​లాక్​డౌన్​​
కాస్ట్‌: శ్వేతా బసు ప్రసాద్, ప్రతీక్ బబ్బర్, సాయి తంహాంకర్, ప్రకాశ్ బెల్వాడీ, సానంద్​ వర్మ, అహనా కుమ్రా
లాంగ్వేజ్: హిందీ
ఫ్లాట్‌ఫాం: జీ5,
రన్​టైం:  153 నిమిషాలు
డైరెక్షన్‌: మధుర్ భండార్కర్

 

కరోనా వల్ల కొన్ని రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ పెట్టినప్పుడు ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. అందులోనూ దేశవ్యాప్తంగా మొదటిసారి పెట్టిన 21 రోజుల లాక్‌డౌన్ టైంలో వలసకార్మికులు ఇబ్బందులు పడ్డారు. ఓ పక్క వైరస్​, మరోపక్క ఆకలితో అల్లాడిపోయారు. ఆ పరిస్థితులను ఆధారంగా చేసుకుని తీసిందే ‘ఇండియా లాక్​డౌన్’. ఈ సినిమాలో నలుగురి జీవితాలు చూపించారు. ‘కొత్త బంగారులోకం’ ఫేం శ్వేతాబసు ప్రసాద్ ఈ సినిమాతో మరోసారి తెరముందుకొచ్చింది. ఇందులో మెహరున్నీసా అనే వేశ్య పాత్రలో నటించింది. సినిమాలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఈమెదే. శ్వేతా బసు తన నటనతో ఆకట్టుకుంది. 

మూన్ అల్వెస్ (అహనా కుమ్రా) ఒక పైలట్​. లాక్​డౌన్​ టైంలో తను పడిన కష్టాలను చూపించారు. నిరుపేద దంపతులు మాధవ్ (ప్రతీక్ బబ్బర్), ఫూల్మతి (సాయి తంహాంకర్) పడిన కష్టాలు కళ్లలో నీళ్లు తెప్పిస్తాయి. సీనియర్ సిటిజన్ ఎల్. నాగేశ్వర్ రావు (ప్రకాష్ బెలవాడి) ఒక తెలుగువాడు. గర్భిణిగా ఉన్న కూతురుని చేరుకోవడానికి తండ్రిగా అతను చేసే ప్రయత్నమే ఆయన కథ. ఇలా.. అన్ని కథలు ఎమోషనల్​గా కనెక్ట్ అవుతాయి.