
భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జి దేశానికి,యువతకు ఆదర్శప్రాయుడని ఆయన ఉద్యమ స్పూర్తి యావత్ దేశానికి ఆదర్శం అన్నారు బీజేపీ నేత,మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. మంగళవారం శ్యామా ప్రసాద్ ముఖర్జి వర్ధంతి సందర్భంగా నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బీజేపీ నేతలు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండడం ఏంటి అని ఉద్యమం చేసిన గొప్ప వ్యక్తి శ్యామా ప్రసాద్ ముఖర్జి అని కొనియాడారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలని మొదటి నుండి ఆయన ఉద్యమం చేశారన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జిని యువత ఆదర్శంగా తీసుకుని పార్టీ బలోపేతం కోసం పనిచేయాలన్నారు .
అనంతరం కరోనా నేపథ్యంలో సీఎం వైఖరి గురించి ప్రస్తావిస్తూ.. తెలంగాణలో దొరల పాలన సాగుతుందని, సామాన్యుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడంలేదని వివేక్ అన్నారు. కరోనా కేసులు అదుపు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యాడని , పాలన పక్కన బెట్టి ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రాజెక్టుల్లో కమిషన్ లెక్కలు వేసుకుంటూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు.
శ్యాం ప్రసాద్ ముఖర్జీ కి నివాళులు అర్పించిన అనంతరం బీజేపీ కార్యాలయంలో, మున్సిపాలిటీలోని 33వ వార్డులో బీజేపీ నేతలు చెట్లు నాటారు.