వర్ని, వెలుగు : సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సాయన్న ప్రజలకు సూచించారు. సోమవారం రుద్రూర్ మండలం అంబం గ్రామశివారులోని ఆదర్శ పాఠశాల, కాలేజీలో సైబర్ మోసాలపై వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. రోడ్డు భద్రతా నియమాలు, మహిళల రక్షణ, మాదకద్రవ్యాలు, సమాజంలో జరుగుతున్న నేరాలు, చట్టాలపై నాటికలు, పాటల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత మాదక ద్రవ్యాల వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్సై సూచించారు.
