బెంగళూరు: కర్నాటక సీఎం సిద్ధరామయ్య బుధవారం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. కర్నాటకకు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నేతగా చరిత్ర సృష్టించారు. మాజీ సీఎం దేవరాజ్ అరసు (కాంగ్రెస్) సాధించిన ఏడేండ్ల 239 రోజుల (మొత్తం 2,792 రోజులు) రికార్డును బద్దలు కొట్టారు.
ఈ నెల 6న 2,792 రోజులతో అరసు రికార్డును సమం చేసిన సిద్ధరామయ్య..బుధవారం2,793 రోజులతో కొత్త రికార్డు నమోదు చేశారు. సిద్ధరామయ్య తన మొదటి పదవీకాలం (మే 13, 2013 నుంచి మే 15, 2018 వరకు)లో పూర్తి ఐదేండ్లు (1,829 రోజులు) పనిచేశారు. ప్రస్తుత రెండోసారి (మే 20, 2023 నుంచి)పదవిలో కొనసాగుతున్నారు.
