ఆరుగురు పార్ట్ టైం టీచర్ల సస్పెన్షన్

ఆరుగురు పార్ట్ టైం  టీచర్ల సస్పెన్షన్

హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ తెలంగాణ సోషల్  వెల్ఫేర్  రెసిడెన్షియల్  జూనియర్  కాలేజీ (బాయ్స్)లో విద్యార్థి వివేక్  మృతి ఘటనపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేసినట్లు తేలడంతో ఆరుగురు పార్ట్​టైం టీచర్లను సస్పెండ్  చేసినట్లు టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్​ జిల్లా సమన్వయకర్త ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 7న సనాదుల వివేక్(13)  రోప్ తో ఆడుతూ ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఈ ఘటనపై ఆర్డీవో రామ్మూర్తి విచారణ చేపట్టి నివేదిక అందజేశారు.