
పలువురు స్టార్ హీరోల చిన్నప్పటి పాత్రల్లో నటించిన దీపక్ సరోజ్.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. తన్వి నేగి హీరోయిన్. వి.యశస్వి దర్శకత్వంలో జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌తో ఇంప్రెస్ చేసిన టీమ్ శుక్రవారం ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘చెలియా చాలు’ అనే సాంగ్‌ను అనిల్ రావిపూడి విడుదల చేసి టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. రథన్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్‌కు దర్శకుడు యశస్వినే లిరిక్స్ రాశాడు. సంజిత్ హెగ్డే పాడాడు. పాటలో దీపక్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు.