‘ద లైఫ్ ఆఫ్ ముత్తు’తో వస్తోన్న సిద్ధి ఇద్నానీ

‘ద లైఫ్ ఆఫ్ ముత్తు’తో వస్తోన్న సిద్ధి ఇద్నానీ

జంబలకిడి పంబ, ప్రేమకథా చిత్రమ్ 2, అనుకున్నదొకటి అయినది ఒకటి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధి ఇద్నానీ.. ఈ నెల 17న ‘ద లైఫ్ ఆఫ్ ముత్తు’ చిత్రంతో వస్తోంది. శింబు హీరోగా ‘వెందు తుణీందదు కాడు’ టైటిల్‌‌‌‌‌‌‌‌తో గౌతమ్ మీనన్ తీసిన ఈ తమిళ చిత్రాన్ని స్రవంతి రవికిశోర్ తెలుగులో విడుదల  చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి సిద్ధి ఇలా మాట్లాడింది.

‘‘గౌతమ్ మీనన్ సినిమాలన్నీ చూశాను. ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. అయితే ఇంత పెద్ద చాన్స్ వస్తుందని ఊహించలేదు. గౌతమ్ విజన్ క్లియర్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. ఆయనతో పని చేయడం నిజంగా అదృష్టమే.  నా పాత్ర పేరు పావని. ముంబైలో పెరిగిన తమిళమ్మాయి. కామ్‌‌‌‌‌‌‌‌గా, సెన్సిబుల్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. ముత్తు జీవితంలో సంతోషమే పావని. చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. బేసిగ్గా గౌతమ్ మీనన్ సినిమాల్లో హీరోయిన్ రోల్స్ స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి. వాటిలో అందం, ఆకర్షణ, ప్రత్యేకత ఉంటాయి. అందుకే సినిమా పూర్తయ్యాక కూడా పాత్ర ప్రభావం నాపై ఉండిపోయింది. ఇంతకు ముందు శింబు, గౌతమ్ చేసినవి రొమాంటిక్ ఫిల్మ్స్. ఇది మాత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ ఫిల్మ్. సెట్స్‌‌‌‌‌‌‌‌లో ఒక ఫైర్ ఉండేది. ఐదు నిమిషాల యాక్షన్ సీన్‌‌‌‌‌‌‌‌ని కూడా సింగిల్ టేక్‌‌‌‌‌‌‌‌లో తీశారు. రొమాంటిక్ సీన్‌‌‌‌‌‌‌‌ని కూడా సింగిల్ టేక్‌‌‌‌‌‌‌‌లో చేశాం. తెలుగులో నేను చేసిన కొన్ని సినిమాలు వర్కవుట్ కాక బ్రేక్ కోసం చూస్తున్నప్పుడు ఈ సినిమా ఆడిషన్స్‌‌‌‌‌‌‌‌ జరుగు తున్నాయని తెలిసి వెళ్లాను. సెలెక్ట్ అయ్యాను. నాకు కథ తెలియదు. నా పాత్ర తెలియదు. శింబు, గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్ చేస్తున్నారని మాత్రమే తెలుసు. అందుకే చిన్న క్యారెక్టర్ అయినా సరే చేయాలని డిసైడయ్యా. సెలెక్టయ్యాక కూడా నిజమని నమ్మలేక పోయాను. అందుకే ఎవరికీ చెప్పలేదు. షూటింగ్ స్టార్ట్ చేసిన రెండు రోజుల తర్వాత ఒక రోజు షూట్ క్యాన్సిల్ చేశారు. నాకు చాలా భయమేసింది. నా బదులు వేరే ఎవరినైనా సెలెక్ట్ చేశారేమోనని గౌతమ్ గారికి ఫోన్ చేసి అడిగా. అలాంటిదేం లేదన్న తర్వాతే అమ్మానాన్నలకు చెప్పా. రెహమాన్ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకి సోల్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ మ్యూజిక్ ఇచ్చారు. శింబుతో కలిసి పనిచేస్తే ఎవరైనా తనకి ఫ్యాన్ అయిపోతారు. చాలా రోజుల తర్వాత ఇలా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. మంచి సినిమా చేశాం. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.’’