
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. గురువారం టీజర్‌ను విడులద చేశారు మేకర్స్. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని టీజర్ ద్వారా రివీల్ చేశారు.
ఇందులో సిద్ధు జొన్నలగడ్డ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇద్దరు హీరోయిన్స్‌తో లవ్ ట్రాక్ నడుపుతూ టిపికల్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి మోడరన్ లుక్స్‌లో ఇంప్రెస్ చేశారు. సిద్దు ఫ్రెండ్‌గా వైవా హర్ష తనదనై హ్యుమర్‌తో ఆకట్టుకున్నాడు. ‘నాకు రాసిపెట్టున్న అమ్మాయి ఎవరో తనంతటే తానే నా లైఫ్‌లోకి రావాలి’ అని సిద్ధు చెప్పే డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. దీపావళి కానుకగా అక్టోబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది.