సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జాక్’. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్‌లైన్. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ కాంబినేషన్‌లో హిలేరియస్ కామెడీ సీన్స్ తీస్తున్నారు. అలాగే సిద్దు కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తుందని అంటున్నారు మేకర్స్.
ఇప్పటికే ఎనభై శాతం వరకూ షూట్ పూర్తయింది. సెప్టెంబర్ 15 నుంచి నేపాల్‌లో నెక్స్ట్ షెడ్యూల్ షూట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లాఫింగ్ రైడ్‌లా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘బేబి’ పేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నాడు.