- సీపీ విజయ్ కుమార్
సిద్దిపేట రూరల్, వెలుగు : జిల్లాలో మరో రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సీపీ ఎస్ఎం విజయ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వర్షాలతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 కాల్ చేయాలని తెలిపారు. 24 గంటలు పోలీస్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా చెరువులు కుంటలు, వాగులు, వంకలు, నిండి పొంగిపొర్లుతాయని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
