
సిద్దిపేట జిల్లా : సిద్ధిపేట నియోజకవర్గంలోని ఐదు ZPTC స్థానాలకు.. 5 స్థానాలు గెల్చుకుంది టీఆర్ఎస్. అన్ని జెడ్పీలు గెల్చుకుని క్లీన్ స్వీప్ చేసింది.
సిద్దిపేట నియోజకవర్గం నారాయణరావు పేట మండల TRS ZPTC అభ్యర్థి కుంబాల లక్ష్మీ 3,380 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
నంగునూర్ మండలం TRS ZPTC అభ్యర్థి తడిసిన ఉమా వెంకట్ రెడ్డి 6,359 ఓట్ల మెజార్టీ తో విజయం సాధించారు.
సిద్దిపేట అర్బన్ మండలం TRS ZPTC పార్టీ అభ్యర్థి తుపాకుల ప్రవళిక 427 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
సిద్దిపేట నియోజకవర్గం సిద్దిపేట రూరల్ TRS ZPTC అభ్యర్థి కోటగిరి శ్రీహరి గౌడ్ 8,076 మెజార్టీ గెలిచారు.
సిద్ధిపేట జెడ్పీ టీఆర్ఎస్ కైవసం
మరోవైపు.. సిద్ధిపేట జిల్లా జెడ్పీని టీఆర్ఎస్ దక్కించుకుంది. 23 జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ 22 స్థానాలు గెల్చుకుంది.
– జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలో 5కు ఐదు స్థానాలు..
– గజ్వేల్ నియోజకవర్గం 6 స్థానాలకు 6 స్థానాలు…
– దుబ్బాక నియోజకవర్గంలో 5 స్థానాలకు ఐదు స్థానాలు…
– హుస్నాబాద్ నియోజకవర్గంలో 3 స్థానాలకు 3 స్థానాలు..
– జనగామ నియోజకవర్గంలో 3 స్థానాల్లో 2 స్థానాలు…
– మానకొండూర్ నియోజకవర్గంలో 1స్థానానికి ఒక స్థానంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.