
సిద్ధూ జొన్నలగడ్డ. టాలీవుడ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ కష్టపడి పైకొచ్చిన నటుడు. డీజే టిల్లు సినిమాకు ముందు ఎన్ని సినిమాలు చేసినా ఇండస్ట్రీలో అంత పెద్ద గుర్తింపు దక్కలేదు. కానీ.. డీజే టిల్లు సినిమాతో సిద్ధూ రాతే మారిపోయింది. ప్రస్తుతం యూత్లో ఈ టిల్లూ బాయ్ క్రేజే వేరు. ఈ స్టార్ బాయ్ సిద్ధూ గురించి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్లో సిద్ధూ, వైష్ణవి జంటగా వచ్చిన ‘జాక్’ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.
.#SidduJonnalagadda returns half of his remuneration Rs 4.75crores to the producer @SVCCofficial @BvsnP as his previous film #Jack incurred losses. Heart Warming Gesture & Right Understanding Of Market Situations.
— BA Raju's Team (@baraju_SuperHit) June 4, 2025
His next #TelusuKada releasing on OCT 17th pic.twitter.com/qNfApGQTLV
BVSN ప్రసాద్ ఈ సినిమా నిర్మాత. ‘జాక్’ సినిమా అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అవడంతో సిద్ధూ జొన్నలగడ్డ పెద్ద మనసుతో తన రెమ్యునరేషన్ నుంచి సగం తిరిగిచ్చేశాడనే ప్రచారం జరుగుతోంది. సినిమా నిర్మాతకు సిద్ధూ రూ.4 కోట్లు వెనక్కి ఇచ్చేశాడని టాక్ నడుస్తోంది. అయితే.. సిద్ధూ గానీ, ‘జాక్’ సినిమా నిర్మాత గానీ ఈ విషయాన్ని నిర్ధారించలేదు. ప్రస్తుతానికైతే ఇదొక ప్రచారం మాత్రమే. కానీ.. ఇదే నిజమైతే మాత్రం సిద్ధూ ఓ మెట్టు పైకెక్కేసినట్టేనని చెప్పక తప్పదు.
సిద్ధూ జొన్నలగడ్డపై అటు ఇండస్ట్రీలో గానీ, ఇటు ప్రేక్షకుల్లో గానీ ఎలాంటి నెగిటివిటీ లేదు. ఈ తరంలో యాంటీ ఫ్యాన్స్ లేని ఏకైన హీరో. ఒక సినిమా హిట్ అయితే క్రెడిట్ ఖాతాలో వేసుకునేందుకు ముందుకొచ్చే హీరోలున్న ఈరోజుల్లో.. సినిమా పోతే నిర్మాత నష్టంలో, కష్టంలో పాలు పంచుకునేందుకు ముందుకు రావడం చిన్న విషయం కాదు. సిద్ధూ జొన్నలగడ్డ 4 కోట్లు తిరిగిచ్చేశాడని మీడియా అయితే కోడై కూస్తోంది. ఇందులో నిజముంటే మాత్రం.. సిద్ధూ జొన్నలగడ్డపై తన అభిమానుల్లో రెస్పెక్ట్ మరింత పెరగడం ఖాయం.