
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) లేటెస్ట్ మూవీ టిల్లూ స్క్వేర్ బాక్సాఫీస్ కల్లెక్షన్స్ తో దూసుకెళ్తోంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లూ స్క్వేర్ మూవీ ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వచ్చేసింది. రిలీజైన మూడు రోజుల్లోనే లాభాల్లోకి రావడమంటే మాటలు కాదు. అంతలా హిట్ కొట్టాడు టిల్లు గాడు. ఇప్పుడీ ఈ మూవీ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల వైపు పరుగులు తీస్తోంది. ఇపుడు ఎక్కడ చూసిన సిద్ధూ హంగామా నడుస్తుండటంతో మేకర్స్ థియేటర్స్ కూడా పెంచే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే టిల్లు హవా ఇప్పట్లో తగ్గేదెలా అనిపిస్తోంది.
టిల్లూ స్క్వేర్ బాక్సాఫీస్ కల్లెక్షన్స్:
మార్చి 29 న రిలీజైన ఈ సినిమా మూడ్రోజుల్లోనే ఆదివారం (మార్చి 31) అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. ఫస్ట్ డే చూసుకుంటే రూ.11 కోట్లు, సెకండ్ డే రూ.11 కోట్లు, ఇక మూడో రోజు ఏకంగా రూ.12 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ లో ఈ సినిమాను ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేసారనే విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా మొత్తంగా రిలీజైన మూడు రోజుల్లొ రూ.34 కోట్ల షేర్ కలెక్షన్లతో లాభాల్లోకి వెళ్లిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అలాగే టిల్లూ స్క్వేర్ వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ హక్కుల రూపంలో రూ.32 కోట్ల బిజినెస్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో వస్తోన్న ఆదరణ బాగుంది. ఇక యూత్ లో అయితే ఆ క్రేజ్ మామూలుగా లేదు.
sacnilk.com లెక్కల ప్రకారం చూసుకుంటే..టిల్లూ స్క్వేర్ మూవీ ఇండియా నెట్ కలెక్షన్లు రూ.32.55 కోట్లుగా, గ్రాస్ కలెక్షన్లు రూ.37.5 కోట్లుగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు ఓవర్సీస్ లో రూ.18 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఓవరాల్ వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లోనే రూ.55.5 కోట్లు వసూలు చేసింది.
ALSO READ :- Comedian Mohan: ఘనంగా పెళ్లిచేసుకున్న జబర్దస్త్ కమెడియన్ మోహన్
అయితే, ఈ సినిమా మేకర్స్ మాత్రం రూ.68.1 కోట్లుగా కలెక్షన్స్ సాధించినట్టు పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ లెక్కన టిల్లూ స్క్వేర్ బాక్సాఫీస్ కల్లెక్షన్స్ మరో మూడ్రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల క్లబ్ లో చేరడం చాలా తేలికగా కనిపిస్తోంది. ప్రొడ్యూసర్ నాగ వంశీ టిల్లూ స్క్వేర్ రిలీజైన ఫస్ట్ డే మీట్ లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఖచ్చితంగా సాధిస్తుందని చాలా నమ్మకంగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
Tillanna's Domination at the Box Office continues, Grosses over ??.? ?? in ? ????, racing towards ????? ????? ??
— Sithara Entertainments (@SitharaEnts) April 1, 2024
Our Starboy ?continues to shatter records all over! ??
- https://t.co/vEd8ktSAEW #TilluSquare #Siddu @anupamahere @MallikRam99 pic.twitter.com/PLvCefITDz