Comedian Mohan: ఘనంగా పెళ్లిచేసుకున్న జబర్దస్త్ కమెడియన్ మోహన్

Comedian Mohan: ఘనంగా పెళ్లిచేసుకున్న జబర్దస్త్ కమెడియన్ మోహన్

తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ షోలలో జబర్దస్త్(Jabardasth) ఒకటి. ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే ఈ షో ద్వారా.. చాలా మంది కొత్త కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారిలో మోహన్(Mohan) ఒకరు. లేడీ గెటప్ లకు ఫేమస్ అయిన మోహన్ ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. తాజాగా ఆయన పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు.

ఇటీవల ఆయన పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వివాహానికి జబర్దస్త్ కమెడియన్స్ రాకెట్ రాఘవ, అధిరే అభి, అప్పారావు, నవీన్‌ హాజరై వధువరులను ఆశీర్వదించారు. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో చూసిన నెటిజన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ALSO READ :- సామ రామ్మోహన్ రెడ్డికి కీలక పదవి