Tillu square Collections: ఇది టిల్లన్న మాస్ జాతర.. ఫస్ట్డే అదిరిపోయే కలెక్షన్స్.. రూ.100 కోట్లు పక్కా!

Tillu square Collections: ఇది టిల్లన్న మాస్ జాతర.. ఫస్ట్డే అదిరిపోయే కలెక్షన్స్.. రూ.100 కోట్లు పక్కా!

థియేటర్స్ లో టిల్లన్న మాస్ జాతర షురూ అయ్యింది. అందరూ ఊహించినట్టుగానే టిల్లు స్క్వేర్( Tillu square) సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన వాళ్ళందరూ నెక్స్ట్ లెవల్లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా టిల్లన్న మల్లి తన కామెడీ స్టైల్ తో రచ్చ రచ్చ చేశాడని అంటున్నారు. కొంతమందైతే డీజే టిల్లుని మించి ఉందని కామెడీ, ట్విస్ట్ లు బాగా సెట్ అయ్యాయని చెప్పుకుంటున్నారు. దీంతో టిల్లు స్క్వేర్ సినిమా డీజే టిల్లు కి మించి విజయం సాదించనుందని క్లియర్ గా అర్థమవుతోంది. 

ఇక సినిమాకు వచ్చిన భారీ రెస్పాన్స్ తో మొదటిరోజు అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది టిల్లు స్క్వేర్. తెలుగు రాష్ట్రాల్లో కేవలం బుకింగ్స్ తోనే ఏకంగా రూ.2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక ఓవర్ సీస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 500కే డాలర్స్ కలెక్ట్ చేసిందని అంచనా. చాలా చోట్ల చివరి నిమిషంలో షోస్ క్యాన్సిల్ కావడం వల్ల కలెక్షన్స్ తగ్గాయని సమాచారం. 

టిల్లు స్క్వేర్ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటీవ్ రెస్పాన్స్ రావడంతో ప్రేమ్ మీట్ నిర్వహించి ఆడియన్స్ కు కృతజ్ఞతలు చెప్పుకొన్నారు మేకర్స్. ఆ కార్యక్రమంలో చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. టిల్లు స్క్వేర్ సినిమాకు ఇంత భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక టిల్లు స్క్వేర్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా మొదటిరోజు రూ.25 కోట్లు  కలెక్ట్ చేయనుందని, మొత్తంగా ఈ సినిమా రూ.100 కోట్ల వరకు కలెక్ట్ చేయడం ఖాయని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ ప్రభావం కూడా ఈ సినిమాపై ఉండబోదని అన్నారు. ప్రస్తుతం నాగవంశీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.