కొవిషీల్డ్ తో‌‌‌‌ సైడ్‌‌‌‌ ఎఫెక్ట్స్‌‌‌‌ కామన్‌‌‌‌

కొవిషీల్డ్ తో‌‌‌‌ సైడ్‌‌‌‌ ఎఫెక్ట్స్‌‌‌‌ కామన్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తమ సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్‌‌‌‌ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌ వివరాలను సీరమ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ వెల్లడించింది. వెరీ కామన్, కామన్‌‌‌‌, అన్‌‌‌‌ కామన్ పేరిట 3 రకాల సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌ వివరాలను ప్రకటించింది. ప్రతి 10 మందిలో ఒకరి కంటే ఎక్కువ మందికి వెరీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చని, ప్రతి పది మందిలో ఒకరికైనా కామన్ సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌ వస్తాయని పేర్కొంది. ప్రతి వందలో ఒకరికి అన్‌‌‌‌కామన్ సైడ్‌‌‌‌ ఎఫెక్ట్స్‌‌‌‌ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇవన్నీ తాత్కాలికమే అయినా ఇంతకంటే పెద్ద ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చంది. 18 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. ఒక్కో డోసు 0.5 ఎంఎల్ ఉంటుందని, తొలి డోసు తీసుకున్న 4 నుంచి 6 వారాల మధ్యలో రెండో డోసు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయంది.

వెరీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌

నొప్పి, దురద, వాపు, అలసట, తలనొప్పి, జ్వరం వచ్చిన ఫీలింగ్ కలగడం, జాయింట్ పెయిన్స్‌‌‌‌, కండరాల నొప్పి, ఏదో జబ్బు చేసిన ఫీలింగ్, ఎర్రబారడం

కామన్ సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌

ఇంజక్షన్ వేసిన దగ్గర గడ్డలు ఏర్పడటం, జ్వరం, వాంతులు, బాడీ టెంపరేచర్‌ పెరగ డం, ముక్కు కారడం, దగ్గు, గొంతు మంట

అన్‌‌‌‌ కామన్ సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌

మత్తెక్కడం, పొత్తి కడుపులో నొప్పి, ఆకలి తగ్గడం, చెమట రావడం, చర్మంపై ర్యాషెస్, విపరీతమైన దురద రావడం

వ్యాక్సిన్‌‌‌‌ వీటితో తయారైంది

ఎల్‌‌‌‌–హిస్టిడిన్, ఎల్–హిస్టిడిన్‌‌‌‌ హైడ్రోక్లోరైడ్‌‌‌‌ మోనోహైడ్రేట్, మెగ్నీషియం క్లోరైడ్ హెక్సాహైడ్రేట్‌‌‌‌, పాలీసార్బేట్‌‌‌‌ 80, ఇథనాల్‌‌‌‌, సుక్రోజ్‌‌‌‌, సోడియం క్లోరైడ్‌‌‌‌, డైసోడియం ఎడెటేట్‌‌‌‌ డీహైడ్రేట్‌‌‌‌(ఈడీటీఏ), వాటర్‌‌‌‌‌‌‌‌

వీళ్లు డాక్టర్ సూచన తీసుకోవాలి

వ్యాక్సిన్ వేసుకునే టైమ్‌‌‌‌కు ఫీవర్‌‌‌‌ ఉన్న వాళ్లు‌‌‌‌, బ్లీడింగ్ డిజార్డర్‌‌‌‌‌‌‌‌, బ్లడ్ చిక్క బడటం వంటి సమస్యలు ఉన్న వాళ్లు, రోగనిరోధక శక్తిని తగ్గించే మెడిసిన్ వాడుతున్న వాళ్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, గర్భం దాల్చాలనుకుంటున్న మహిళలు