Kiara Advani wedding: 6న కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి!

Kiara Advani wedding: 6న కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి!

బాలీవుడ్‌ నటులు కియారా అడ్వాణీ, సిద్ధార్థ్‌ మల్హోత్ర ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా వార్తుల వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వని ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలుస్తో్ంది. రాజస్థాన్,  జైసల్మీర్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఈనెల 6న జరగనుందని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. 

దుబాయ్ లో ఇద్దరి కుటుంబం, సన్నిహితులతో ఈనెల 4, 5వ తేదీల్లో సంగీత్, హల్దీ వేడుకలు జరుగనున్నాయి. సినీ ప్రముఖుల కోసం ముంబైలో రిసెప్షన్  ప్లాన్ చేస్తున్నారని, పెళ్లి వేడుక మొత్తాన్ని డాక్యుమెంటరీగా రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే, వీళ్లిద్దరూ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. షేర్షా మూవీ తర్వాత ఈ ఇద్దరు క్లోజ్ గా ఉండటంతో ఈ వార్తలు ఇంకా బలపడ్డాయి. భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో కియారా తెలుగువారికి పరిచయమయింది.