సిగ్నేచర్ గ్లోబల్ లాభం రూ.101 కోట్లు

సిగ్నేచర్ గ్లోబల్ లాభం రూ.101 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: రియల్​ఎస్టేట్​కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ 2025 ఆర్థిక సంవత్సరం ఫలితాలను ప్రకటించింది. ఈసారి నికరలాభం 531శాతం భారీ వృద్ధితో రూ.101 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం కేవలం రూ.16 కోట్లు మాత్రమే వచ్చాయి.

ప్రీ-సేల్స్ విలువ రూ.10,290 కోట్లుగా నమోదయింది. ఏడాది లెక్కన ఇది 42శాతం పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో వసూళ్లు 41శాతం పెరిగి రూ.4,380 కోట్లకు చేరుకున్నాయి. నికర రుణ భారం రూ.1,160 కోట్ల నుంచి రూ.880 కోట్లకు తగ్గింది. ఆపరేటింగ్ ఆదాయం 102 శాతం వృద్ధితో రూ.2,500 కోట్లకు చేరింది.