
బెంగళూరు: 7–11 ఏండ్ల పిల్లలపై కరోనా టీకా ట్రయల్స్‌కు సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. అమెరికా రూపొందించిన నోవావాక్స్(కోవోవాక్స్)ను సీరమ్ మన దేశంలో తయారు చేస్తోంది. ‘‘కమిటీలో విస్తృతంగా చర్చించాక, టీకా ట్రయల్స్‌కు సంబంధించి ప్రొటోకాల్ ప్రకారం 7 నుంచి 11 ఏండ్ల పిల్లల ఎన్రోల్ మెంట్‌కు అనుమతి ఇవ్వాలని సిఫార్సు చేశాం” అని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ)కు చెందిన సబ్జెక్టు ఎక్స్ పర్ట్ ప్యానెల్ మంగళవారం తెలిపింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే 12 నుంచి 17 ఏండ్ల పిల్లలపై నోవావాక్స్ ట్రయల్స్ చేస్తోంది. మొదటి 100 మందికి సంబంధించిన డేటాను కూడా సీడీఎస్ సీఓకు అందజేసింది. కాగా, ఇప్పటి వరకు పిల్లల టీకాకు సంబంధించి జైడస్ క్యాడిలాకు మాత్రమే మన దేశంలో అనుమతి లభించింది. ఈ టీకాను 12 ఏండ్లు పైబడిన పిల్లలకు వేయొచ్చు.