
SIIMA అవార్డ్స్ 2023(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ప్రతి సంవత్సరం కండక్ట్ చేయబడతాయి. ఇది అత్యంత గుర్తింపు పొందిన అవార్డు గా భావిస్తారు. ఈ ఏడాది 2023 సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది. లేటెస్ట్ గా ఉత్తమ సహాయ నటి- తెలుగు నామినేషన్ల లిస్ట్ ను ప్రకటించింది సైమా.
- ALSO READ : పెళ్లి తర్వాత కూతుళ్లు మారిపోతారు : ఇంటర్నెట్ లో ఎమోషనల్ డిస్కషన్.. ఇందులో మీరూ ఉంటారు కచ్చితంగా..
ఒకే ఒక జీవితం మూవీకి గాను అక్కినేని అమల(Akkineni Amala), విరాట పర్వం లో అద్భుత పెర్ఫార్మన్స్ ఇచ్చిన ప్రియమణి(Priyamani), పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లా నాయక్ సంయుక్త మీనన్ (Samyukta Meenon)..అలాగే 2022 లో చిన్న సినిమాగా వచ్చి..క్రైమ్ హర్రర్ లో బెస్ట్ మూవీ గా నిలిచినా మాసూద. ఇందులో కీ రోల్ ప్లే చేసిన సంగీత(Sangeetha), అడవి శేష్ హీరోగా సెన్సషనల్ హిట్ అందుకున్న మేజర్ మూవీకు గాను శోభిత ధూళిపాళ(Shobita Dhulipala) సెలెక్ట్ అయ్యారు. ఇక సైమా ఎవర్ని వరిస్తుందో చూడాలి.
రీసెంట్ గా ఈ అవార్డ్స్‌కు పోటీ పడుతున్న హీరోస్ లిస్ట్ ను సైమా రిలీజ్ చేసింది.
మేజర్ మూవీతో సెన్సషనల్ హిట్ అందుకున్న హీరో అడవి శేష్ (Adivi Sesh),
సీతారామం మూవీతో మంచి క్లాసిక్ హిట్ తో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan),
RRR మూవీతో ప్రపంచవ్యాప్తంగా స్టార్ స్టేటస్ పొందిన జూ.ఎన్టీఆర్(N. T. R Jr), రామ్ చరణ్(Ram Charan) తో పాటు
మిస్టరీ అడ్వెంచర్ ఫిల్మ్, స్పిరిట్యుయల్ కంటెంట్ తో సక్సెస్ అయినా.. కార్తికేయ మూవీతో నిఖిల్ సిద్దార్ద్( Nikhil Siddhartha),
అలాగే యూత్ లో కొత్త జోష్ తీసుకొచ్చిన DJ టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda).
ఈ అవార్డ్స్ ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చలనచిత్ర పరిశ్రమల నుండి దక్షిణ భారత చలనచిత్రాలలో బెస్ట్ పెర్ఫామెన్స్ కనబరిచిన మూవీస్ కు, డైరెక్టర్స్, హీరోస్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన వారికి ఈ అవార్డ్స్ ను అందిస్తారు.