
సౌత్ ఇండియాలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డ్స్ 2023(Siima awards2023) వేడుక దుబాయ్‌లో సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. ఎంతో ఘనంగా మొదలైన ఈ వేడుకకు దక్షిణాది తారాలోకం కదిలి వచ్చారు. ఇక టాలీవుడ్ కు సంబంధించి స్టార్ హీరో రానా, మంచు లక్ష్మీ వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. మొదటిరోజున తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల వేడుక పూర్తి కాగా. నేడు(సెప్టెంబర్ 16) తమిళ,మలయాళం ఇండస్ట్రీకి చెందిన అవార్డుల కార్యక్రమం జరుగనుంది.
ఇక ఈ అవార్డ్స్ లో టాలీవుడ్ నుండి ఆర్ఆర్ఆర్ అండ్ సీతారామం సినిమాల హవా నడిచింది. అందులో ఆర్ఆర్ఆర్ ఏకంగా 11 విభాగాల్లో నామినేట్ అవగా.. 5 కీలకమైన అవార్డులను దక్కించుకుంది. ఇక సీతా రామం మూవీ మూడు అవార్డులను దక్కించుకుంది. ఇక మొత్తంగా సైమా 2023లో అవార్డ్స్ దక్కించుకున్న సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి.
- ఉత్తమ చిత్రం: సీతా రామం
- ఉత్తమ దర్శకుడు: SS రాజమౌళి(ఆర్ఆర్ఆర్)
- ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్)
- ఉత్తమ నటి: శ్రీలీల(ధమాకా)
- ఉత్తమ నటుడు(క్రిటిక్స్ ఛాయస్): అడివి శేష్(మేజర్)
- ఉత్తమ నటి(క్రిటిక్స్ ఛాయస్): మృణాల్ ఠాకూర్(సీతా రామం)
- ఉత్తమ సహాయ నటుడు: రానా దగ్గుబాటి(భీమ్లా నాయక్)
- ఉత్తమ సహాయ నటి: సంగీత(మసూద)
- ఉత్తమ నూతన నటి: మృణాల్ ఠాకూర్(సీతా రామం)
- ఉత్తమ సంగీత దర్శకుడు: MM కీరవాణి(ఆర్ఆర్ఆర్)
- ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (నాటు నాటు ఆర్ఆర్ఆర్)
- ఉత్తమ గాయకుడు: రామ్ మిర్యాల(DJ టిల్లు)
- ఉత్తమ గాయని: మంగ్లీ (ధమాకా)
- ఉత్తమ విలన్: సుహాస్ (హిట్2)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్(ఆర్ఆర్ఆర్)
- ఉత్తమ నూతన దర్శకుడు: వశిష్ట మల్లిడి(బింబిసార)
- సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: నిఖిల్ సిద్ధార్థ(కార్తికేయ2)
- ఉత్తమ హాస్యనటుడు: శ్రీనివాస రెడ్డి(కార్తికేయ2)
- ఉత్తమ నూతన నిర్మాతలు: శరత్, అనురాగ్(మేజర్)
- ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శ్రుతి హాసన్
- ప్రామిసింగ్ న్యూకమ్: గణేష్ బెల్లంకొండ(స్వాతిముత్యం)