బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా సీక బాలరాజు

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా సీక బాలరాజు

హైదరాబాద్, వెలుగు :  బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా సీక బాలరాజు గౌడ్ నియామకం అయ్యారు. ప్రధాని మోదీ  ప్రవేశపెట్టిన పథకాలతో పాటు, తెలంగాణలో బీసీ సీఎం చేస్తామని ప్రకటించడంపై  రంగారెడ్డి జిల్లాకు చెందిన సీక బాలరాజు గౌడ్  సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ఆఫీసులో ఆ పార్టీలో చేరారు.  బీసీలను ఏకం చేసి తన వంతుగా బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా బాలరాజు గౌడ్  తెలిపారు.  అనంతరం ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్  చేతుల మీదుగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకపత్రం అందుకున్నారు.

ఈ నియామకానికి సహకరించిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, దాసరి మల్లేశ్​కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బూర మల్సూర్ గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పాలకూరి ఏలెంద్ర గౌడ్, లష్కర్ గూడ  అధ్యక్షుడు సీక నరసింహ గౌడ్, అజయ్, మధు తదితరులు పాల్గొన్నారు.