మరీ టాలెంటెడ్‌లా ఉన్నాడే: కోహ్లీ ఆల్‌టైం రికార్డ్‌కు చేరువలో జింబాబ్వే స్టార్

మరీ టాలెంటెడ్‌లా ఉన్నాడే: కోహ్లీ ఆల్‌టైం రికార్డ్‌కు చేరువలో జింబాబ్వే స్టార్

జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అంతర్జాతీయ క్రికెట్ లో తన టాప్ ఫామ్ కొసాగిస్తున్నాడు. ముఖ్యంగా టీ20ల్లో ఈ ఆల్ రౌండర్ అదే పనిగా చెలరేగుతున్నాడు. బ్యాటింగ్ లో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ, బౌలింగ్ లో మ్యాజిక్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ జట్టును సింగిల్ హ్యాండ్ తో గెలిపిస్తున్నాడు. తాజాగా నిన్న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ క్రమంలో టీ20 ల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆల్ టైం రికార్డ్ ఒకటి సమం చేసాడు.

రజా టీ20 కెరీర్ లో ఇప్పటివరకు 14 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లు గెలుచుకున్నాడు. ఈ లిస్టులో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే కోహ్లీ రికార్డ్ త్వరలోనే బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుంది. పైగా కోహ్లీ ప్రస్తుతం టీ20 లకు దూరంగా ఉంటున్నాడు. జింబాబ్వే కెప్టెన్ వరుసగా నాలుగోసారి టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం విశేషం. 

హరారే వేదికగా నిన్న(డిసెంబర్ 7)  జరిగిన తొలి టీ20లో జింబాబ్వే ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. ఉత్కఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో మొదట బౌలింగ్ లో రజా తన నాలుగు ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి మెరిశాడు. ఆతర్వాత బ్యాటింగ్ లోనూ చెలరేగి  42 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులు చేశాడు.
   
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను 147 పరుగులు చేసింది. బాల్బర్ని(32) , టక్కర్(21),హెక్టర్(26), డీలాని(26) పర్వాలేదనిపించారు. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 9 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 9 న హరారేలో జరుగుతుంది.