స్పామ్ కాల్స్కు చెక్.. అన్ నోన్ కాల్స్ మ్యూట్ అవుతయ్

 స్పామ్ కాల్స్కు చెక్.. అన్ నోన్ కాల్స్ మ్యూట్ అవుతయ్

వినియోగదారుల అవసరాలమేరకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ తీసుకొస్తుంటుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మరొక ఫీచర్ తో ముందుకు వచ్చింది. వాట్సాప్ యూజర్లను అన్ నోన్ కాల్స్, స్పామ్ కాల్స్ విసిగిస్తూ ఉంటాయి. ఈ మధ్య సైబర్ దాడులు ఎదుర్కొంటున్నవాళ్లూ ఉన్నారు. వాటిని ఎదుర్కోలేని చాలామంది మనశ్శాంతిని కోల్పోతున్నారు. అందుకే సైబర్ దాడులను తగ్గించి వినియోగదారుల సెక్యూరిటీకోసం కొత్త అప్ డేట్ తీసుకొస్తోంది.

సైలెంట్ అన్ నోన్ కాలర్ పేరుతో కొత్త ఫీచర్ తీసుకురానుంది. దీనివల్ల స్పామ్, స్కామ్ కాల్స్ కు దూరంగా ఉండొచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్లి ఈ ఫీచర్ ని ఎనేబుల్ చేస్తే స్పామ్, స్కామ్ కాల్స్ ఏవీ రావు. వచ్చినా సైలెంట్ లోనే ఉంటాయి. బయటికి రింగ్ కావు. అయితే, ప్రస్తుతం బీటా టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ ను త్వరలోనే అభివృద్ధి చేయనున్నారు. మొదట ఆండ్రాయిడ్, తర్వాత  ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.