
హైదరాబాద్ : ట్రోఫీలు మాయమైన సంఘటన మంగళవారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వెలుగు చూసింది. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆఫీపులో ఉంచిన ట్రోఫీలు చోరి అయ్యాయని గుర్తించారు అధికారులు. కరోనా వల్ల జూలై నెలలో అసోసియేషన్ కార్యదర్శి జీపీ కార్యాలయానికి తాళం వేశారు. అయితే 20 రోజుల తర్వాత మంగళవారం వెళ్లి చూడగా.. ఆఫీసు తాళం పగులగొట్టి ఉందని..దొంగలు పడ్డారనే అనుమానంతో లోపలికి వెళ్లి చూస్తే… కప్ బోర్డు ధ్వంసం చేసిన దుండగులు ట్రోఫీలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించామన్నారు అధికారులు. కప్బోర్డులోని ఒక వెండి, 15 ఇత్తడి ట్రోఫీలు మాయం అయినట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.