మోదీపై యుద్ధం చేస్తే కాంగ్రెస్ నాశనం.. జీ రాంజీపై రాజకీయాలు వద్దు: ఎంపీ అర్వింద్ కామెంట్స్

మోదీపై యుద్ధం చేస్తే కాంగ్రెస్ నాశనం.. జీ రాంజీపై రాజకీయాలు వద్దు: ఎంపీ అర్వింద్ కామెంట్స్

నిజామాబాద్​, వెలుగు: జీ రాంజీ  స్కీమ్​పై కాంగ్రెస్​గగ్గోలు పెట్టడడం విడ్డూరంగా ఉందని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీపై యుద్ధం చేస్తానని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారని, ఆ పార్టీ పక్కా నాశనమవుతుందని విమర్శించారు. శుక్రవారం బీజేపీ జిల్లా ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

కేంద్రం ఉపాధి హామీలో అవినీతికి చెక్ ​పెడుతూ,  పనులను125 రోజులకు పెంచిందని  పేర్కొన్నారు. స్కీమ్​పై కాంగ్రెస్,​ బీఆర్ఎస్​ పాలిటిక్స్​ చేస్తున్నాయని విమర్శించారు. కల్వకుంట్ల కవిత పెట్టే కొత్త పార్టీకి సీఎం రేవంత్​రెడ్డి ఫండింగ్ ​ఉందని ఎంపీ అర్వింద్​ఆరోపించారు. మేడంకు పైసలు ఖర్చు పెట్టే గుణం లేదన్నారు. 

ఎన్నికలప్పుడే పతంగి ఎగురతదని, ఆ తర్వాత మజ్లిస్​కనబడదని కామెంట్​చేశారు. నిజామాబాద్​పేరును ఇందూరు​గా మార్చుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని పేర్కొన్నారు.  అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ దినేశ్ పాల్గొన్నారు.