ఈ నెల 26న సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుడికి అవార్డు ప్రదానం

ఈ నెల 26న సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుడికి అవార్డు ప్రదానం

కరీంనగర్ ఫిలిగ్రీ సంస్థ ప్రధాన కార్యదర్శి గద్దె అశోక్ కుమార్ 2018లో కిలోన్నర వెండితో చేసిన పల్లకి కళకు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం..ఆయన్ని ఈ నెల 28న జాతీయ అవార్డుతో సత్కరించనుంది. ఈ అవార్డును ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో ఉపరాష్ట్రపతి బహూకరించనున్నారు. తీగలతో పల్లకీ తయారు చేసిన అశోక్ కుమార్ కు ఈ అవార్డును ఎప్పుడో ఇవ్వాల్సింది. కానీ, కరోనా కారణంగా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర టెక్స్ టైల్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26న అశోక్ కుమార్ ఈ అవార్డు అందుకోనున్నారు.

కరీంనగర్ లో అత్యంత ప్రసిద్ధి గాంచిన సిల్వర్ ఫిలిగ్రీ కళకు మరోసారి జాతీయ గుర్తింపు లభించింది. వెండి నగిషీ వస్తువుల తయారీకి అంతర్జాతీయ స్థాయిలో కరీంనగర్ కు గుర్తింపు వచ్చింది. దేశ, విదేశీ అతిథులకు ప్రభుత్వం తరఫున ఫిలిగ్రీ కళారూపాలు బహుకరించే ఆనవాయితీ ఎప్పట్నుంచో ఉంది. అందుకోసం కరీంనగర్ లోని సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ సంస్థ కళాకారులు ఏటా వివిధ రూపాల కళాఖండాలు తయారు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. అందులో భాగంగా 2018లో ఈ సంస్థకు చెందిన ప్రధాన కార్యదర్శి గద్దె అశోక్ కుమార్ కిలోన్నర వెండితో అద్భుతాన్ని సృష్టించారు. తీగలతో పల్లకీ తయారీ చేసిన అశోక్ కుమార్.. దానిని ఢిల్లీలోని జాతీయ చేతి కళల అభివృద్ధి సంస్థకు పంపించగా జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైంది. అయితే కరోనా కారణంగా ఈ అవార్డు పంపిణీలో ఆలస్యం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర టెక్స్ టైల్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈనెల 28న ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో ఈ అవార్డును ఉప రాష్ట్రపతి బహూకరించనున్నారు.