
హైదరాబాద్, వెలుగు: నేషనల్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ విమెన్స్ టీమ్ సిల్వర్ గెలిచింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా జరిగిన ఈ టోర్నీలో కెప్టెన్, విమెన్స్ ఇంటర్నేషనల్ మాస్టర్ వేల్పుల సరయు, గాదె శరణ్య, సాయి మహతి, ఎ. కార్తీక, దీక్షిత రాణించడంతో తెలంగాణ రెండో ప్లేస్ సాధించింది. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (పీఎస్‌పీబీ) గోల్డ్ గెలవగా, ఎల్‌ఐసీ జట్టు బ్రాంజ్ సొంతం చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో సరయు సూపర్ పెర్ఫామెన్స్‌తో బోర్డ్ ప్రైజ్‌గా గోల్డ్ నెగ్గింది. ఆరు రౌండ్లకు గాను ఆమె 5.5 పాయింట్లు సాధించింది. ఆదిరెడ్డి అర్జున్ నేతృత్వంలోని మెన్స్ టీమ్ ఐదో స్థానంతో సరిపెట్టింది. నేషనల్ చెస్ టోర్నీలో రాణించిన తెలంగాణ జట్లను శాట్స్ అధికారులు రవీందర్, చంద్రా రెడ్డి, అశ్విన్ బుధవారం సన్మానించారు.