మరింత పెరగనున్న వెండి ధరలు

మరింత పెరగనున్న వెండి ధరలు

ముంబై: సమీపకాలంలో వెండి ధరలు బంగారం కంటే వేగంగా పెరుగుతాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎంఓఎఫ్​ఎస్​ఎల్​) పేర్కొంది. దీని ప్రకారం గత అక్షయతృతీయ నుంచి గోల్డ్,  సిల్వర్ వరుసగా 13శాతం  11శాతం పెరిగాయి.

 ఇప్పుడు ధరలు తగ్గితే వీటిని కొనిపెట్టుకోవాలని సూచించింది.  దేశీయంగా గోల్డ్‌‌‌‌‌‌‌‌ ధర రూ.75 వేలకు, వెండి ధర రూ.లక్షకు చేరవచ్చని అంచనా వేసింది.  కమోడిటీ ఎక్స్చేంజ్​లోనూ ఈ రెండింటి ధరలు భారీగా పెరుగుతాయని తెలిపింది.