డిజిటల్ వైపు సిమ్రాన్‌‌

డిజిటల్ వైపు సిమ్రాన్‌‌

ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు తగ్గితే ఎలా అని టెన్షన్ పడేవారు యాక్టర్స్. కానీ ఓటీటీలు కూడా సినిమాలు తీస్తూ ఉండటంతో ఆ బెంగ తీరిపోయింది. ముఖ్యంగా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినవారికి వెబ్ మూవీస్‌‌ బాగా ఉపయోగపడుతున్నాయి. ‘పేట’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్‌‌ కూడా డిజిటల్ వైపు అడుగులు వేయడానికి కారణం అదే. ఆల్రెడీ రాకెట్రీ, అంధగన్‌‌ (తెలుగులో మాస్ట్రో), కెప్టెన్ వంటి చిత్రాల్లో నటిస్తున్న సిమ్రాన్.. ‘గుల్‌‌మొహర్’ అనే హిందీ ఫిల్మ్‌‌కి కూడా కమిటయ్యింది. మనోజ్‌‌ బాజ్‌‌పేయ్‌‌ మేల్‌‌ లీడ్‌‌గా చేస్తున్నాడు. బాలీవుడ్ సీనియర్‌‌‌‌ హీరోయిన్ షర్మిలా ఠాగూర్‌‌‌‌ పదకొండేళ్ల తర్వాత ఈ చిత్రంతో కెమెరా ముందుకొస్తున్నారు. రకరకాల జెనరేషన్స్‌‌ ఉన్న ఓ కుటుంబం చుట్టూ తిరిగే కథ. ముప్ఫై నాలుగేళ్లుగా నివసిస్తున్న ఇంటిని వదులుకోవాల్సి వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యుల ఫీలింగ్స్‌‌ ఏమిటనేది మెయిన్ పాయింట్. వారి అనుబంధాలు, వాళ్ల మధ్య ఉండే రహస్యాలు, ఇన్​సెక్యూరిటీస్‌ వంటివన్నీ చాలా ఎమోషనల్‌‌గా ఉంటాయని చెబుతున్నాడు దర్శకుడు రాహుల్. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ఆగస్ట్‌‌లో డిస్నీప్లస్ హాట్‌‌స్టార్‌‌‌‌లో విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.