శబ్దం’ చిత్రంలో సిమ్రాన్ ఇంపార్టెంట్ రోల్‌

శబ్దం’ చిత్రంలో సిమ్రాన్  ఇంపార్టెంట్ రోల్‌

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా వెలిగిన సిమ్రాన్.. సెకెండ్ ఇన్నింగ్స్‌‌‌‌ లో  కీలక పాత్రలు పోషిస్తోంది. తాజాగా మరో చాన్స్ అందుకుంది.  ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న ‘శబ్దం’ చిత్రంలో సిమ్రాన్  ఇంపార్టెంట్ రోల్‌‌‌‌‌‌‌‌లో నటిస్తోందని గురువారం ప్రకటించారు. 

అరివళగన్‌‌‌‌‌‌‌‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. లక్ష్మీ మీనన్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. ‘వైశాలి’ తర్వాత  ఆది, అరివళగన్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. సెవెన్ జీ ఫిలిమ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు.