BWF వరల్డ్ చాంపియన్షిప్: ప్రిక్వార్టర్స్ లోకి సింధు, సైనా,శ్రీకాంత్

BWF వరల్డ్ చాంపియన్షిప్: ప్రిక్వార్టర్స్ లోకి సింధు, సైనా,శ్రీకాంత్

బాసెల్‌‌‌‌: అందని ద్రాక్షగా మిగిలిన స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌‌‌‌  వరల్డ్‌ ‌‌‌చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ను ఘనంగా ఆరంభించారు.  తొలి రౌండ్‌‌‌‌లో బై లభించడంతో రెండో రౌండ్‌‌‌‌తో ఆట ఆరంభించిన ఈ ఇద్దరు..  అలవోక విజయాలతో ప్రిక్వార్టర్స్‌‌‌‌కు దూసుకెళ్లారు.  కిడాంబి శ్రీకాంత్‌‌‌‌ మాత్రం రెండో రౌండ్‌‌‌‌ దాటేందుకు కష్టపడ్డాడు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్​ సెకండ్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో ఐదో సీడ్‌‌‌‌ సింధు 21–-14, 21–-14తో  పై యు పో (చైనీస్ తైపీ)ని ఓడించింది.  మరో మ్యాచ్‌‌‌‌లో ఎనిమిదో సీడ్‌‌‌‌ సైనా నెహ్వాల్‌‌‌‌ 21-–10, 21–11 తో సొరయ డెవిసిచ్‌‌‌‌ (నెథర్లాండ్స్‌‌‌‌)పై వరుస గేమ్స్‌‌‌‌లో విజయం సాధించింది.  పురుషుల సెకండ్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో ఏడో సీడ్‌‌‌‌ శ్రీకాంత్‌‌‌‌ 13–21, 21–13, 21–16 తో మిషా జిల్బర్మన్‌‌‌‌ (ఇజ్రాయిల్‌‌‌‌)పై మూడు గేమ్‌‌‌‌ల పాటు పోరాడి గెలిచాడు. ఫస్ట్​ గేమ్​లో తేలిపోయిన శ్రీకాంత్​ తర్వాత గొప్పగా పుంజుకున్నాడు. తర్వాతి రెండు గేమ్స్​లో తనదైన శైలిలో దూకుడుగా ఆడి వరుస పాయింట్లతో విరుచుకుపడ్డాడు.

డబుల్స్‌‌‌‌ ప్లేయర్లకు నిరాశ

మెగా టోర్నీలో ఇండియా డబుల్స్‌‌‌‌ ప్లేయర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. మహిళల డబుల్స్‌‌‌‌ రెండో  రౌండ్‌‌‌‌లో అశ్విని పొన్నప్ప–- సిక్కిరెడ్డి జోడీ 22-–20, 21–-16తో  డు యూ– లి యిన్ హుయ్ (చైనా) చేతిలో,  జక్కంపూడి మేఘన– పూర్విషా రామ్ ద్వయం  8–21,18–21తో  షిహో టనక– యొనెమొటో(జపాన్‌‌‌‌) చేతిలో ఓడి ఇంటిదారి పట్టాయి. పురుషుల డబుల్స్ రెండో  రౌండ్‌‌‌‌లో మను అత్రి–-సుమీత్‌‌‌‌ రెడ్డి 20–-22, 16–21తో హన్‌‌‌‌చెంగ్ కై–హావో డాంగ్(చైనా) ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది.