ప్రపంచంలో సింగపూర్‌లోనే తొలిసారిగా ల్యాబ్ చికెన్

ప్రపంచంలో సింగపూర్‌లోనే తొలిసారిగా ల్యాబ్ చికెన్

కరోనావైరస్ భయంతో ప్రజలు ఏం తినాలన్నా ఆలోచిస్తున్నారు. మరీ ముఖ్యంగా నాన్‌వెజ్ విషయంలో అయితే చెప్పక్కర్లేదు. కరోనా తీవ్రత ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న సమయంలో దేశంలో నాన్‌వెజ్ రేట్లు భారీగా తగ్గాయి. ఆ సమయంలో చికెన్ కేజీ రూ. 20 లకే అమ్మిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుంది. అయినా కూడా జనాలు చికెన్ తినాలంటే బెంబేలెత్తుతున్నారు. దాంతో అమెరికాకు చెందిన స్టార్ట్-అప్ కంపెనీ ఈట్ జస్ట్.. ల్యాబ్‌లో పెరిగిన కోడి మాంసాన్ని విక్రయించాలని నిర్ణయించింది. దాంతో సింగపూర్‌లో ల్యాబ్ చికెన్ అమ్మకంలోకి రాబోతోంది. అంతేకాకుండా ప్రపంచంలోనే తొలిసారిగా ల్యాబ్ చికెన్ అమ్మకాన్ని ఆమోదించిన మొదటి దేశంగా సింగపూర్ అవతరించింది.

కరోనాకు భయపడి సింగపూర్‌లో ప్రజలు సాధారణ చికెన్‌కు బదులు జంతు కణాల నుంచి తయారైన ల్యాబ్ చికెన్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అటువంటి చికెన్‌ను బియాండ్ మీట్ ఇంక్ మరియు ఇంపాజిబుల్ ఫుడ్స్ వంటి కంపెనీలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ రకానికి చెందిన చికెన్ సింగపూర్ సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లలో లభిస్తుంది.

ఈ విషయంపై ఈట్ జస్ట్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ జోష్ టెట్రిక్ స్పందించాడు. ఈ ల్యాబ్ చికెన్ అందుబాటులోకి వస్తే సాధారణ చికెన్ ధరలు తగ్గుతాయని ఆయన అన్నారు. ఈ చికెన్ సాధారణ చికెన్‌తో సమానమని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా రెండు డజన్లకు పైగా కంపెనీలు ల్యాబ్‌లలో పెంచే చేపలు, గొడ్డు మాంసం మరియు చికెన్‌లపై పరీక్షలు చేస్తున్నాయి. ఈ కంపెనీలు సాధారణ మాంసానికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి ప్రవేశించాలని భావిస్తున్నాయని ఆయన అన్నారు.

For More News..

పెళ్లి వాహనంపై బోల్తా పడ్డ ఇసుక లారీ.. ఎనిమిది మంది మృతి

ఆరుగురు ప్రెగ్నెంట్ గర్ల్‌ఫ్రెండ్స్‌తో పెళ్లికొచ్చిన క్లబ్ ఓనర్

కరోనాతో బీజేపీ ఎంపీ మృతి