సింగపూర్‌ ఓపెన్‌ : సెమీస్‌లోకి పీవీ సింధు

సింగపూర్‌ ఓపెన్‌ : సెమీస్‌లోకి పీవీ సింధు

సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ప్లేయర్ పీవీ సింధు సెమీస్‌లోకి ప్రవేశించింది. శుక‍్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో పీవీ సింధు 21-13, 17-21, 21-14 తేడాతో యాన్యాన్‌(చైనా)పై విజయం సాధించి సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకుంది. తొలి గేమ్‌ను సింధు ఈజీగా గెలవగా, రెండో గేమ్‌లో యాన్యాన్‌ తన స్పీడ్ పెంచింది. ఫలితంగా రెండో గేమ్‌లో సింధుకు ఓటమి తప్పలేదు. నిర్ణయాత‍్మక మూడో గేమ్‌లో సింధు తన జోరును కొనసాగించింది.

శనివారం జరుగనున్న సెమీ ఫైనల్లో పీవీ సింధుతో ఒకుహరా తలపడనుంది.