
దక్షిణ మధ్య రైల్వేలో మొదటిసారి గా హైదరాబాద్, ఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలుపై సింగరేణి కాలరీస్ కంపెనీ యాడ్స్‌ను ముద్రించారు. శుక్రవారం యాడ్స్‌తో ఉన్న రైలు ఢిల్లీకి బయలుదేరింది.
రైలు బోగీలపై కిటికీల నుంచి కింది భాగం వరకు వినైల్ ఫ్లెక్స్‌తో యాడ్స్ ముద్రించారు. దీని ద్వారా రైల్వేకు రవాణేతర ఆదాయం సమకూరనుంది. ఈ సందర్భంగా అధికారులను ఎస్సీఆర్ జీఎం గజానన్ మాల్యా అభినందించారు.