మందమర్రి పట్టణంలోని కారు ఢీకొని సింగరేణి ఉద్యోగి మృతి

మందమర్రి పట్టణంలోని కారు ఢీకొని సింగరేణి ఉద్యోగి మృతి

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలోని బురదగూడెం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సింగరేణి ఉద్యోగి అక్కడికక్కడే చనిపోయాడు. పట్టణ ఎస్సై రాజశేఖర్​తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి మూడో జోన్ కార్మెల్ హైస్కూల్​ ఏరియాకు చెందిన తోట సతీశ్​కుమార్​(59) కేకే-5 సింగరేణి బొగ్గు గనిలో మ్యాన్​వే క్లర్క్​గా విధులు నిర్వహిస్తున్నాడు. 

పనినిమిత్తం సతీశ్​ రాత్రి బురదగూడెం వద్ద  జాతీయ రహదారిని దాటుతుండగా బెల్లంపల్లి నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి డీకొట్టింది. డ్రైవర్​ కారును నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదం జరిగిందని, మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.