క్లోజ్ చేసిన గనులపై సింగరేణి ఫోకస్

క్లోజ్ చేసిన గనులపై  సింగరేణి ఫోకస్
  • ఏడు గనులను విస్తరణకు ముమ్మర చర్యలు
  • ఏటా 23 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
  • పబ్లిక్ హియరింగ్ కు సింగరేణి సన్నాహాలు

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి గనుల్లో క్రమేణా బొగ్గు నిల్వలు తగ్గుతుండడంతో మూసివేసినవాటిపై ఫోకస్ చేసింది. సింగరేణివ్యాప్తంగా11 ఏరియాల్లో 38  బొగ్గు గనులు ఉన్నాయి.  ఇప్పటికే మూడు ప్రాంతాల్లోని గనుల్లో బొగ్గు నిల్వలు అంతరించే దశకు చేరాయి. అక్కడ కొత్త గనుల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి ఏరియాలకు భవిష్యత్ ఉండదనే ఆందోళనలు తలెత్తాయి.

 వచ్చే ఐదేండ్లలో 7 గనులు మూత పడనుండగా, రోజుకు14 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి లోటు ఏర్పడనుంది. ఇంకోవైపు కార్మికులు, ఉద్యోగుల భద్రతపైనా ఆందోళన నెలకొనగా..  6,511 మందిని సర్దుబాటు చేయాల్సి పరిస్థితి ఎదురవుతుంది. 2030 – -31నాటికి  క్లోజ్ అయ్యే గనులకు ప్రత్యామ్నా య మార్గాలను సింగరేణి వెతుకుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే గనుల వేలంలో జాప్యమవు తోంది.

 దీంతో మూసివేసిన అండర్ గ్రౌండ్, ఓపెన్ మైన్స్ లో మిగిలిన బొగ్గును తవ్వేందుకు సింగరేణి  ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆయా గనుల్లో విస్తరణ పనులు చేపడితే ఏటా 23 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి  చేయవచ్చని యాజమాన్యం భావిస్తోంది. ఇప్పటికే కొన్ని గనులకు పర్యావరణ, ఫారెస్ట్ క్లియరెన్స్ లు తెచ్చుకుం ది. పబ్లిక్ హియరింగ్ కు సన్నాహాలు చేస్తోంది. మరికొన్ని గనుల పర్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.

కేంద్రం గనుల వేలంలో జాప్యం 

ప్రస్తుతం సింగరేణి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. కొత్త బ్లాకులు రానట్లయితే ఉత్పత్తిలో సగానికి పైగా పడిపోయే ప్రమాదముంది. సంస్థకు చెందిన 40 వేల మంది కార్మికులు, పరోక్షంగా30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్ దృష్ట్యా ఇకపై బొగ్గు బ్లాక్​ల వేలంలో పాల్గొనేందుకు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్​కూడా ఇచ్చింది. అయితే.. కేంద్రం బొగ్గు గనుల వేలం ప్రక్రియలోనే తీవ్ర జాప్యం జరుగుతుంది.  

 పబ్లిక్​ హియరింగ్ కు ఏర్పాట్లు 

బెల్లంపల్లి ఏరియాలో మూసివేసిన గోలేటీ –1,1ఏ యూజీ మైన్లతో పాటు బెల్లంపల్లి ఓసీపీ –2 ఎక్స్​టెన్షన్​బ్లాక్​,అబ్బాపూర్​ఓసీపీలను కలుపుకొని కొత్తగా గోలేటీ ఓసీపీ పేరుతో విస్తరించేందుకు చర్యలు తీసుకోగా..  పర్మిషన్లు తుది దశకు చేరాయి. ఇందుకు1,358.280 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఏటా 3.5మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు. 2022, అక్టోబర్​లోనే పబ్లిక్ హియరింగ్ పూర్తి చేసింది.

 జేకే ఓసీపీలో బొగ్గు నిల్వలు లేకపోవడంతో పూసపల్లి ఓపెన్​కాస్ట్ పేరుతో ఎక్స్​టెన్షన్​కు ప్లాన్​చేసింది. ఇక్కడ 2 మిలియన్​ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే చాన్స్ ఉంది. ఇప్పటికే అన్ని పర్మిషన్స్​తెచ్చుకుంది. రామగుండం రీజియన్​లోని ఓసీపీ1,2, అడ్రియాల, వకీల్​పల్లి, జీడీకే -10  గనులను కలిపి రామగుండం కోల్​మైన్ మెగా ఓసీపీగా చేస్తే.. ఏటా 6 మిలియన్​ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయవచ్చు. 

దీనికి ఈసీ పర్మిషన్​రావాల్సి ఉంది. ఇక్కడ వచ్చే నెల 19న పబ్లిక్​ హియరింగ్​నిర్వహించనుంది. మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ఓపెన్​కాస్ట్​లో బొగ్గు నిల్వలు తగ్గుతుండగా, రెండో ఫేజ్ విస్తరణ పర్మిషన్లకు సింగరేణి ప్రయత్నాలు చేస్తోంది. మూతపడిన ఆర్కే4,3,ఆర్కే1,1ఏ గనులతో కలిసి విస్తరణ ఓసీపీ ప్రారభిస్తే.. ఏటా 3.5మిలియన్​టన్నుల బొగ్గు వెలికితీయవచ్చు. 

దీనికి వచ్చే నెల 3న రెండో ఫేజ్​పబ్లిక్​ హియరింగ్​నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. పీవీఎన్​ఆర్​ఓసీపీ నుంచి 2 మిలియన్​టన్నులు, వీకే ఓసీపీ నుంచి 5 మిలియన్​టన్నులు, మణుగూరు ఓసీపీ ఎక్స్​టెన్షన్​ నుంచి 2 మిలియన్​టన్నుల బొగ్గును, ఎంవీకే ఓసీపీ నుంచి 2 మిలియన్​టన్నులు ఉత్పత్తి చేయాలని సింగరేణి ప్లాన్​చేసింది.

 మూసివేసిన గనుల్లో మిగిలిన బొగ్గును..

బెల్లంపల్లి రీజియన్​లోని శ్రీరాంపూర్​–1, రవీంద్ర ఖని –5,7, ఆర్కేన్యూటెక్​, ఇందారం –1ఏ, కల్యాణిఖని –5 గనులను క్రమంగా మూసి వేస్తోంది. మరోవైపు మూతపడిన గనుల్లో  మిగిలిన బొగ్గును తవ్వేందుకు చర్యలు చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర అటవీ, ఎన్విరాన్​మెంట్​శాఖల ద్వారా అటవీ భూములు, ఇతర ప్రభుత్వ, పైవేటు స్థలాలు, పర్యావరణ పర్మిషన్లు వస్తే విస్తరించుకునే హక్కు సింగరేణికి ఉంది. 

ఇప్పటికే వీకే ఓసీపీ, జీడీకే10 ఓసీపీ, జేకే ఓసీపీ(పూసపల్లి),గోలేటీ ఓసీపీ, ఆర్కేపీ ఓసీపీ రెండో ఫేజ్​,పీవీఎన్​ఆర్​(వెంకటాపురం), మణుగూ రు ఓసీపీల విస్తరణ ప్రక్రియ తుది దశకు చేరింది. వీటితో పాటు మరికొన్ని గనుల విస్తరణకు ప్లాన్​చేసి పర్మిషన్లకు దరఖాస్తులు చేసుకుంది.