సింగరేణికి ఇండియాస్‌‌ బెస్ట్‌ అవార్డు

సింగరేణికి ఇండియాస్‌‌ బెస్ట్‌ అవార్డు

వెలుగు: సింగరేణి సంస్థకు అమెరికాకు చెందిన బెర్క్‌‌షైర్‌ కంపెనీ ఇటీవల ప్రకటించిన ‘ఇండియాస్‌ బెస్ట్‌’ అవార్డును సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ముంబైలో శనివారం అందుకున్నారు. బైర్క్‌‌షైర్‌ సీఈఓ హేమంత్‌ కౌషిక్‌‌, వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ ఎమిలీవాల్స్‌‌ నుంచి అవార్డు అందుకున్న అనంతరం శ్రీధర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహంతో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, దీంతో సింగరేణి సంస్థ వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. 2013-14 తో పోలిస్తే 2017-18 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు రవాణా 34 శాతం, బొగ్గు ఉత్పత్తి 22.9 శాతం, లాభాల్లో 186 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేసుకుందన్నారు. సింగరేణిలో పనిచేసే అధికారులు, కార్మికులకు అంకితభావం, సమష్టిగా లక్ష్యాలను సాధిస్తున్నారన్నారు. సంస్థకు జాతీయ స్థాయిలో ఇండియాస్‌‌ బెస్ట్‌‌ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు.