- నోటీసు అందజేసిన మందమర్రి ఏరియా సింగరేణి ఆఫీసర్లు
కోల్బెల్ట్, వెలుగు: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించకపోతే సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని మందమర్రి ఏరియా సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.రమేశ్ హెచ్చరించారు. శనివారం మందమర్రి ఏరియా ఇన్ చార్జ్ జీఎం ఎం.మల్లయ్యకు డిమాండ్లతో కూడిన నోటీసును ఏరియా సింగరేణి ఆఫీసర్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని సింగరేణి యాజమాన్యానికి పలుమార్లు వినతిపత్రాలు అందజేశామన్నారు.
కోర్టు ఆదేశాలతో 2007 నుంచి 2014 వరకు పెండింగ్లో ఉన్న పీఆర్పీ బకాయిలతో పాటు 2022–23,2023–24 ఆర్థిక సంవత్సరాల పీఆర్పీ బకాయిలు చెల్లించాలని డిమాండ్చేశారు. ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులతో సమానంగా సింగరేణిలోని 2,300 మంది ఆఫీసర్లకు ఫ్రీ కరెంట్, ఐఐటీ/ఐఐఎం ఫీజు రీయింబర్స్మెంట్ ప్రయోజనాలను అమల్లోకి తేవాలన్నారు.
తమ డిమాండ్ల సాధించుకునేందుకు ఈనెల24 నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతామని, డిసెంబర్1న వర్క్ టు రూల్ కొనసాగిస్తామని వెల్లడించారు. అసోసియేషన్ సెక్రటరీ బసవరాజు, వైస్ ప్రెసిడెంట్వర్ధన్, జాయింట్సెక్రటరీ రవి, నరేశ్, ట్రెజ రర్ సరిత, జాయింట్ ట్రెజరర్ సంతోష్, ఏజెంట్ రాంబాబు, సేఫ్టీ ఆఫీసర్ శంకరయ్య, ఐఈడీ ఎస్ఈ కిరణ్కుమార్తదితరులు పాల్గొన్నారు.
పీఆర్పీ బకాయిలపై ఖచ్చితమైన హామీ ఇవ్వాలి
జైపూర్, వెలుగు: పెండింగ్ లో పీఆర్పీ బకాయిలను వెంటనే చెల్లించాలని జైపూర్ ఎస్టీపీపీ సీఎంఓఏఐ ఆధ్వర్యంలో ఈడీ చిరంజీవికి వినతిపత్రం అందించారు. సీఎంఓఎఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ పంతులా మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం అధికారులకు 2022 నుంచి 2024 వరకు చెల్లించాల్సిన పీఆర్పీ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.
2007 నుంచి 2014 వరకు పెండింగ్ లో ఉన్న పీఆర్పీ బకాయిలను చెల్లించాలని హై కోర్టు తీర్పు ఇచ్చినా ఇప్పటివరకు చెల్లించ లేదని అన్నారు. అధికారుల బదిలీలు, ప్రమోషన్లను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. జీఎంలు నరసింహారావు, మదన్ మోహన్, కార్యవర్గ సభ్యులు సీఎంఓఎఐ సెక్రటరీ సంతోష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్లు శ్రీనివాస్, అప్పారావు, అధికారులు శ్రీనివాస్, రమేశ్, జాయింట్ సెక్రటరీ శ్రీమతి తదితరులు పాల్గొన్నారు
