గోదావరిఖని: సింగరేణి ఆఫీసర్ల సమస్యల పరిష్కారంలో మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ నిర్లక్ష్యం

గోదావరిఖని: సింగరేణి ఆఫీసర్ల  సమస్యల పరిష్కారంలో మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ నిర్లక్ష్యం

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో పనిచేస్తున్న ఆఫీసర్లు తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని, అవసరమైతే సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో నిరసనలు తెలిపితే తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆందోళనలను వాయిదా వేయించిన ఉన్నతాధికారులు.. ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని కోల్​మైన్స్​ ఆఫీసర్స్​ అసోసియేషన్​ ఆఫ్​ఇండియా (సీఎంఓఏఐ) సింగరేణి బ్రాంచ్​ ప్రెసిడెంట్​ తాళ్లపల్లి లక్ష్మీపతిగౌడ్​, జనరల్​సెక్రటరీ పెద్ది నర్సింహులు అన్నారు. 

ఆఫీసర్ల వేతనాలలో భాగమైన ‘ఫెర్ఫార్మెన్స్​ రిలేటెడ్​ పే (పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ) కోల్​ ఇండియాలో చెల్లిస్తున్నప్పటికీ సింగరేణిలో మాత్రం రెండేళ్లుగా అమలు చేయడం లేదన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే 15 నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామని, అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.