సింగరేణి చేపట్టిన పవర్ ప్లాంట్ పనులు వేగవంతం చేయాలి

సింగరేణి చేపట్టిన పవర్ ప్లాంట్ పనులు వేగవంతం చేయాలి
  •     సోలార్, గ్రీన్ ​ఎనర్జీపై  అధికారులతో సీఎండీ సమీక్ష 

హైదరాబాద్, వెలుగు: సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన గ్రీన్​ఎనర్జీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎండీ ఎన్. బలరామ్ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్​లో  సోలార్, గ్రీన్​ ఎనర్జీ , ఇతర వ్యాపార విస్తరణ చర్యలపై అధికారులతో సీఎండీ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా బలరామ్​ మాట్లాడుతూ.. అక్టోబర్ నాటికి 122 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేయాలని, టెండర్లు ఖరారైన 137 మెగావాట్ల  ప్లాంట్ల నిర్మాణాన్ని తక్షణం ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 504 మెగావాట్ల సోలార్ సామర్థ్యం సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు. రామగుండంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు సానుకూల నివేదిక రాగా, దీని నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు.