కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ఓపెన్ కాస్ట్ ఫేజ్2 ఎక్స్టెన్షన్ మైన్ పర్యావరణ పర్మిషన్ కోసం పబ్లిక్ హియరింగ్సభ బుధవారం జరగనుంది. ఓసీపీ ఓబీ కాంట్రాక్ట్ కంపెనీ క్యాంపు ఆఫీస్లో జరిగే సభ కోసం సింగరేణి యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా ఏర్పాట్లను మంగళవారం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్రెడ్డి పరిశీలించారు.
హియరింగ్ సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ఏసీపీ రవికుమార్ నేతృత్వంలో ముగ్గురు సీఐలు,ఎనిమిది మంది ఎస్సైలతో పాటు 100 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తామని సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ రీజియన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజినీర్ల ఆధ్వర్యంలో మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య నేతృత్వంలో పబ్లిక్ హియరింగ్ జరుగనుంది. సింగరేణి కంపెనీకి చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
