బదిలీ వర్కర్, జనరల్ అసిస్టెంట్ ట్రైనీల రెగ్యుల రైజేషన్

బదిలీ వర్కర్, జనరల్ అసిస్టెంట్ ట్రైనీల రెగ్యుల రైజేషన్
  •     1,135 మందిని జనరల్ అసిస్టెంట్లుగా నియమిస్తూ సింగరేణి ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రెగ్యులరైజేషన్​ కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్న బదిలీ వర్కర్, జనరల్ అసిస్టెంట్ ట్రైనీలకు సింగరేణి యాజమాన్యం దీపావళి సందర్భంగా తీపికబురు చెప్పింది. దాదాపు 1,135 మంది కార్మికులను జనరల్ అసిస్టెంట్లుగా రెగ్యులర్​చేస్తూ శుక్రవారం సింగరేణీ సీఎండీ బుద్దా ప్రకాశ్ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 1 నుంచి క్రమబద్ధీకరణ అమలులోకి రానుంది. 

2025 డిసెంబర్ 31కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. అంతకుముందు భూగర్భ విభాగంలో పనిచేసిన వారు ఏ సంవత్సరంలోనైనా 190 వర్కింగ్​ డేస్​, ఓపెన్ కాస్ట్ గనులు, బయట విభాగాల్లో పనిచేసిన వారు 240 వర్కింగ్ డేస్ పూర్తి చేసి ఉన్నవారికి కూడా దీనితో ప్రయోజనం కలగనుంది. ఏరియావారీగా అర్హుల జాబితాలను ఈ నెల 23 లోగా సమర్పించాలని జీఎంలను ఆదేశించారు. రెగ్యులరైజ్​ అయిన కార్మికులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.