ఒక్కో సింగరేణి కార్మికుడి ఖాతాలో రూ. లక్షా 53 వేలు

ఒక్కో సింగరేణి కార్మికుడి ఖాతాలో రూ. లక్షా 53 వేలు

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. సింగరేణి లాభాల్లో వాటా బోనస్ గా  ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షలు చెల్లించనుంది. బోనస్ మొత్తం రూ.711.18 కోట్ల లాభాలను కార్మికులకు పంపిణీ చేయనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో  ఈ నిధులను సింగరేణి యాజమాన్యం విడుదల చేసింది. అక్టోబర్ 16న కార్మికుల అకౌంట్లలో దసరా కానుక జమ కానుంది.

సింగరేణి సంస్థ ఈ ఏడాది  రూ.  రూ.2,222 కోట్ల లాభం సంపాదించింది.  దీంతో కార్మికులకు ఇచ్చే వాటాను 30 నుంచి 32 శాతం పెంచాలని సీఎం కేసీఆర్ సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు.  ఈ వాటాను కార్మికులకు దసరా కానుకగా అందించాలని సింగరేణి సంస్థను ఆదేశించారు.  దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లించాలని సూచించారు. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు  సగటున ఒక్కో ఉద్యోగికి రూ. ఒక లక్ష 53 వేల రూపాయల వరకు లాభాల బోనస్ అందనుంది.  గతేడాది రూ.368 కోట్లను కార్మికులకు బోనస్‌గా అందించారు.