కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కేకే-5 బొగ్గు గనికి చెందిన కార్మిక లీడర్ ఏడుకోలా పవన్ కుమార్ కు రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శ్రమ శక్తి అవార్డు అందజేశారు. కార్మిక రంగంలో చేసిన సేవకు గాను పవన్ కుమార్ కు ఈ అవార్డు దక్కింది. శనివారం కార్మిక శాఖ పేషీలో మంత్రి చేతుల మీదుగా కుటుంబసభ్యులతో కలిసి పవన్ కుమార్ అవార్డు అందుకున్నారు. శ్రమశక్తి అవార్డు అందుకున్న మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్లీడర్, ఐఎన్టీయూసీ కార్మికనేత పుల్లూరి లక్ష్మణ్‌ను మంత్రి వివేక్ అభినందించారు.
