ప్రముఖ సింగర్‌ జుబిన్ నౌటియాల్ కు గాయాలు

ప్రముఖ సింగర్‌  జుబిన్ నౌటియాల్ కు గాయాలు

ప్రముఖ గాయకుడు జుబిన్ నౌటియాల్ మెట్లపై నుండి పడడంతో గాయాల పాలయ్యారు. తన ఇంట్లో మెట్ల దిగుతుండగా సడెన్ గా పడిపోవడడంతో జుబిన్ కు మోచేయి, పక్కటెముకలు విరగడంతో పాటు, తలకు సైతం దెబ్బలు తగిలినట్టు సమాచారం. దీంతో వెంటనే అతన్ని ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జుబిన్ కుడిచేయి తీవ్రంగా గాయపడడంతో.. దాన్ని కొన్ని రోజుల పాటు వాడొద్దని, ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.

ఈ విషయం తెలుసుకున్న జుబిన్ ఫ్యాన్స్ అతను తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. గెట్ వెల్ సూన్ జుబిన్ అంటూ జుబిన్ ను ట్యాగ్ చేస్తున్నారు.  బాలీవుడ్ సెలబ్రెటీలు సైతం జుబిన్ నౌటియల్ త్వరగా కోలుకొని రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ మధ్యనే దుబాయ్ లో జుబిన్ నౌటియల్ ప్రదర్శనలు ఇచ్చారు.