
తిరుమల : ప్రముఖ సింగర్ సునీత గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్న సునీతను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లాక్ డౌన్ లో శ్రీవారి దర్శనానికి రాలేకపోయానని, ఇన్నాళ్లకు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ..జనవరి 9న తన వివాహం జరగనుందని తెలిపింది.
తనకు మంచి జీవితాన్ని అందించాలని స్వామి వారిని కోరుకున్నట్టు చెప్పింది. 19 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న సునీత కొద్ది రోజులకే తన భర్తకు విడాకులు ఇచ్చి, అప్పటి నుండి పిల్లలతో కలిసి సపరేట్ గా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా సునీత, రామ్ వీరపనేని ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.